Saturday, December 28, 2024

టి20 సిరీస్‌కు రాహుల్ దూరం

- Advertisement -
- Advertisement -

ముంబై: వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు భారత స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో అతను టి20 సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది. రాహుల్‌కు మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని బిసిసిఐ వైద్య బృందం సూచించింది. దీంతో రాహుల్ టి20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే గాయం వల్ల సిరీస్ ఆరంభానికి ముందే జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా పాల్గొనలేదు. తాజాగా విండీస్‌తో జరిగే టి20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.

KL Rahul ruled out T20 Squad against WI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News