Sunday, December 22, 2024

మూడో టెస్టుకు రాహుల్ దూరం

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగనున్న మూడో టెస్టు నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఈ విషయాన్ని బిసిసిఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. రాహుల్ స్థానంలో దేవ్‌దుత్ పడికల్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ గాయం వల్ల రెండో టెస్టుకు కూడా దూరంగా ఉన్నాడు.

అయితే మిగిలిన మూడు టెస్టులకు అతనికి చోటు కల్పించారు. కానీ రాహుల్ మాత్రం పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో అతన్ని మూడో టెస్టు నుంచి తప్పించక తప్పలేదు. ఇప్పటికే సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. గాయంతో శ్రేయస్ అయ్యర్ కూడా దూరమయ్యాడు. కాగా, రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News