Friday, November 22, 2024

రెండు నెలల్లో కెఎల్‌ఐ డి 82 కాలువ పనులను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : సెప్టెంబర్ చివరి నాటికి కెఎల్‌ఐ డి 82 కాలువ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కెఎల్‌ఐ ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డి 82 కాలువతో జంగారెడ్డి పల్లి నుంచి కల్వకుర్తి నియోజకవర్గం చివరి ఆయకట్టు నాగిళ్ల చెరువును కెఎల్‌ఐ కాలువ నీళ్లతో నింపాలని అధికారులను ఆదేశించారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు అలసత్వం వహించడం తగదని ఆయన హెచ్చరించారు. మహాత్మ గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 4 లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్షంగా ఈ పథకాన్ని రూపొందించాలని ఆయన అన్నారు. కృష్ణా న ది జలాల్లో ఆనాటి అంచనా ప్రకారం 25 టిఎంసీల సా మర్థం పెంచి కెఎల్‌ఐకి మొత్తం 45 టిఎంసీల సాగునీరు వచ్చేలా చేశారని అన్నారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీరు ఎంజి కెఎల్‌ఐ అందిస్తుందన్నారు.

ఏళ్లూరు, సింగో టం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్‌ల ద్వారా జిల్లాకు సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. 565 కోట్లు మంజూరు చేయించి 168 కిలోమీటర్ల మేర సాగునీరు అందించే అంచనాతో నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.

సెప్టెంబర్ చివరి నాటికి నాగిళ్ల వరకు సాగునీరు అందాలి
డి 82 కాలువ 90శాతం పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల మండలం నాగిళ్ల వరకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు, కెఎల్‌ఐ కాలువ కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచించారు.

కాంట్రాక్టర్‌కు 90 చెల్లింపులు జరిగాయని అన్నారు. అధికారులు పనిచేయించాలని అన్నారు. డి 82 కాలువ భాగంగా కాలువలపై స్ట్రక్చర్లు 30 మిగిలి ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆయన అన్నారు.

అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం
కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా డి 82 కాలువ పనులలో జరుగుతున్న జాప్యం పట్ల్ల ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చే శారు. సెప్టెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని ఆయన సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు పూర్తి స్థాయిలో చెల్లించింద ని మరో 20 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

సమీక్ష సమావేశంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ విజయ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల శ్రీకాంత్, అధికారులు ఈఈ శ్రీకాంత్, డిఈలు దేవన్న, నరేందర్ రెడ్డి, ఏఈలు తిరుపతయ్య, తిరుపతి, విశ్వనాథ్, చంద్రకాంత్, మధుకాని ఏజెన్సి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News