Monday, December 23, 2024

నా కూతురిది ఆత్మహత్యాయత్నం కాదు.. హత్య చేయాలని చూశారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ కూతురిది ఆత్మహత్య యత్నం కాదని, హత్య చేయాలని చూశారని కెఎంసి మెడికో ప్రీతి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చనేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రీతి మాట్లాడిన ఆడియోలు వింటే ఆమెను ఎంతగా వేధించారో అర్ధమవుతుంద న్నారు. తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనతో ఫోన్ మాట్లాడే సమయంలో కూడా ప్రీతి భయపడుతూనే ఉందని చెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తనపై జరుగుతున్న వేధింపుల గురించి ప్రీతి తన తల్లికి వివరించిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో ప్రీతి తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను తల్లికి చెప్పుకుని బాధపడింది. అయితే ఈ సమయంలో ప్రీతికి ఆమె తల్లి ధైర్యం చెప్పింది.

ఆడియో టేప్‌లో…

“సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్‌లని వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒకటే. నాన్న పోలిసులతో ఫోన్ చేయించాడు. అయినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నేను సైఫ్ పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి నన్ను దూరం పెడతారు. హెచ్‌ఒడి నాగార్జున రెడ్డి ఏదైనా ఉంటే నా దగ్గరికి రావాలి కానీ, ప్రిన్సిపాల్ కి ఎందుకు ఫిర్యాదు చేశారని నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు” అని ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ బాధ పడింది. ఇలా అన్ని దారులూ మూసుకుపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News