Tuesday, November 5, 2024

ఎన్నికల రాష్ట్రాలకు రైతు బృందాలు

- Advertisement -
- Advertisement -

KMP Expressway blockade on 6th

 

6న కెఎంపి ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధం
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాల నేతలు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులుతమ ఉద్యమాన్ని ఉధృతంచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) నేతలు ఈ నెల 15 వరకు కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలకు రైతు నేతల బృందాలను పంపి బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 6న తమ పోరాటం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు కుండ్లిమానేసార్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేను దిగ్బంధించాలని నిర్ణయించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు యోగేంద్ర యాదవ్ మంగళవారం విలేఖరులకు తెలిపారు.

ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు అయిదు గంటలపాటు ఈ దిగ్బంధం కొనసాగుతుందని తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలవాలని, ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలను ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కిసాన్ మోర్చా నేతలు సందర్శిస్తారని భారతీయ కిసాన్ మోర్చా (రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్ ఎస్. రాజేవాల్ తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ బృందాలు రైతులను కోరుతాయన్నారు. రైతుల ఉద్యమం పట్ల కేంద్రప్రభుత్వ వైఖరిని వారికి వివరిస్తారన్నారు. ఈ నెల12న కోల్‌కతాలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికలు జరిగే రాష్ట్రాల రైతులకు విజ్ఞప్తి చేయనున్నలట్లు ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News