Wednesday, January 22, 2025

సర్కారు దవాఖానాలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు

- Advertisement -
- Advertisement -

Knee replacement surgeries in government Hospitals

మహబూబ్ నగర్/హైదరాబాద్ : కేవలం కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం అయన మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సల యూనిట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానాల్లో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సకు సంబంధించిన ఇంప్లాంట్స్ లేక పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. చాలా మంది భయంతో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలను చేయించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాదని తెలిపారు. కానీ అలాంటి అపోహలు నిజం కాదన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో అందుబాటులోకి వచ్చిన ఖరీదైన మోకాలు మార్పిడి సేవలను వినియోగించుకోవాలని కోరారు. శస్త్ర చికిత్సల యూనిట్ ప్రారంభం సందర్భంగా వైద్యులను అభినందించడమే కాకుండా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రామాల పర్యటన సందర్భంగా ప్రతి గ్రామంలో కనీసం 10 మంది మొకాలి నొప్పితో బాధ పడేవారు కనిపించేవారని, ఈరోజు నుండి ఇక్కడే ఆసుపత్రిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నందున పేద ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఖరీదైన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఇంప్లాంట్స్ మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలో వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే అందరికీ నిర్లక్ష్యం ఉండేదని, నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అనే పరిస్థితి నుండి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించామని తెలిపారు. త్వరలోనే పాత కలెక్టర్ స్థానంలో రూ. 500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేస్తామని తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై పేదలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చికిత్సలను మహబూబ్ నగర్ లోనే అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు సిబ్బంది ప్రజలకు కలిగించాలని, వైద్య సేవలపట్ల ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. జనరల్ హాస్పిటల్లో త్వరలోనే గుండెకు సంబంధించిన బైపాస్ చికిత్సలను కూడా అందించబోతున్నామని, ఇందుకు రూ. 4 కోట్ల వ్యయంతో క్యాథ్ ల్యాబ్ మంజూరు అయిందని, దీనిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అంతకు ముందు మంత్రి ఆర్థో వార్డులో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స మార్పిడి వైద్యం కోసం వచ్చిన చిన్నారెడ్డి, సరోజ, లక్ష్మీ దేవిలతో మాట్లాడుతూ ఎలాంటి భయం లేదని… ఖరీదైన ఇంప్లాంట్స్ వాడికాలు మార్పిడి శాస్త్ర చికిత్స చేయబోతున్నట్లు భరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News