Sunday, December 22, 2024

జర్నలిస్టును కత్తులతో పొడిచి….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: జర్నలిస్టును కత్తులతో పొడిచి అతడి దగ్గర ఉన్న నగదును ఎత్తుకెళ్లిన సంఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మలయాళం న్యూస్ ఛానెల్‌కు చెందిన ఓ జర్నలిస్టు ఝండేల్‌వాలన్ ప్రాంతంలో బస్సు ఎక్కి… మంగళమ్ చౌక్ బస్టాప్‌లో దిగాడు. మంగళమ్ చౌక్ నుంచి సంజయ్ పార్క్ నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించి జేబులో ఉన్న పర్సును లాక్కున్నారు. పర్సులో క్రెడిట్, డెబిట్, ఐడి కార్డులు ఉండడంతో పర్సు వెంటనే దుండగుల నుంచి జర్నలిస్టు తీసుకున్నాడు.

Also Read: పెళ్లి మండపంలో వధువు, వరుడిపై యాసిడ్ దాడి…. పది మందికి గాయాలు

ఈ క్రమంలో జర్నలిస్టుపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. పెనుగులాటలో అతడి వీపుపై కత్తితో పొడిచారు. వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దుండగుల నుంచి దొంగతనం చేసిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News