Tuesday, December 24, 2024

ఢిల్లీలో లేడీడాక్టర్‌పై క్లినిక్‌లోనే దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో లేడీడాక్టరుసంజయ్ భూటియాపై ఆమె క్లినిక్ భవనంలోనే దాడి జరిగింది. శనివారం ఓ వ్యక్తి వెస్ట్ ఢిల్లీలోని టాగూరు గార్డెన్ ఎక్స్‌టెంషన్ ఏరియాలోని క్లినిక్‌లోకి చొరబడి మధ్యాహ్నం పూట ఈ 45 సంవత్సరాల డాక్టరుపై కత్తితో దాడికి దిగాడని పోలీసులు తెలిపారు. ఆగంతకుడు ఆమెపై క్లినిక్‌కు చెందిన బిల్డింగ్‌లోనే మెట్లపై దాడికి దిగినట్లు డిసిపి (వెస్ట్) విచిత్రవీర్ వెల్లడించారు.

డాక్టర్ భూటియా ఈ బిల్డింగ్‌లో పై అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. కింది పోర్షన్‌లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. దాడితో ఆమెకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికంగా ఉండే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స జరుపుతున్నారు. దుండగుడు దాడి తరువాత అక్కడి నుంచి ఫరారయ్యాడు. దొంగతనం కోసం ఈ వ్యక్తి రాలేదని, ఈ వ్యక్తి తెలిసినవాడే అయ్యి ఉంటాడని, అయినా కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుననట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News