Wednesday, January 1, 2025

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిపై కత్తితో దాడి (వీడియో)

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: అక్క భర్త ఆమె చెల్లిపై కన్ను వేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లికి ఒప్పుకొని మరదలిపై బావ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూరగాయలు కోసే కత్తితో ఆమెపై అర్ధరాత్రి దాడి చేశాడు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న యువతిపై నిర్ధాక్షణంగా దాడికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అనిత అవుట్ సోర్స్ ఉద్యోగినిగా ఆసుపత్రిలో పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్పత్రిలో ఉన్న అనితపై భావ కిషన్ నాయక్ దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆమెపై విరుచుకుపడ్డాడు. ఈ పెనుగులాటలో ఆమె చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో పడుకున్న సిబ్బంది అనితపై నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా పిడి గుద్దులు గుద్దుతూ దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెలుగు చూసింది.

అనితను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా కిషన్ నాయక్ వేధిస్తున్నాడు. ఆమె ఎంతకు ససేమీరా ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు కేశంపేట ఎస్సై ధనుంజయ తెలిపారు. ప్రస్తుతం కిషన్ నాయక్ పోలీసుల అదుపులో ఉన్నాడని పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరుగుతున్నట్లు ఎస్సై ధనుంజయ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News