Saturday, March 1, 2025

కత్తి దూసిన కన్న ప్రేమ

- Advertisement -
- Advertisement -

తన కూతురుతో సన్నిహితంగా
ఉన్న యువకుడిపై కత్తితో దాడి
చేసిన తండ్రి అవమాన
భారంతో కూతురు ఆత్మహత్య
చావు బతుకుల్లో యువకుడు
హన్మకొండలో ఘటన

కుమార్తెతో సన్నిహితంగా ఉండటం
చూసి తట్టుకోలేక దారుణం
అవమానభారంతో కుమార్తె ఆత్మహత్య
యువకుడి పరిస్థితి విషమం
హన్మకొండలో సంఘటన

మన తెలంగాణ/వరంగల్ క్రైమ్: హన్మకొండ గోపాల్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన కుమార్తెతో తన ఇంట్లోనే సన్నిహితంగా ఉన్న యువకుడి గొంతును ఆమె తండ్రి కోశాడు. ఈ దారుణాన్ని చూసి అవమానంతో ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… హన్మకొండ పట్టణంలోని గోపాలపురంలో భరత్ అనే యువకుడితో ఓ మైనర్ బాలికకు కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆ యువకుడితో ఇంట్లో సన్నిహితంగా ఉండడాన్ని ఆమె త్ంరడ్రి గమనించాడు.

ఆగ్రహంతో ఆ యువకుడిపై దాడి చేసి గొంతు కోశాడు. ఈ అవమానంతో ఆ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని కాకతీయ విశ్వవిద్యాలయ పోలీస్‌స్టేషన్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News