Friday, November 22, 2024

మినరల్ వాటర్ కు డబ్బులు అడిగినందుకు… కత్తులతో దాడి

- Advertisement -
- Advertisement -

Knife attack on young man in Saidabad

 

హైదరాబాద్: మినరల్ వాటర్ తీసుకున్న తరువాత డబ్బులు అడిగినందకు యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సైదాబాద్ లో రహదారిని అబ్దుల్ జబ్బార్ అనే వ్యక్తి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉండే ఖాలేద్ అనే యువకుడు ప్లాంట్ కు వచ్చి నీళ్లు క్యాన్ లో నింపుకున్నాడు. డబ్బులు ఇవ్వమని అడగగానే తననే  డబ్బులు ఇవ్వమంటావా? అని… తాను సైదాబాద్ కు డాన్ ను  అని తన స్నేహితులతో కలిసి వచ్చి జబ్బార్ పై ఖాలేద్ కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జబ్బార్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. జబ్బార్ తలకు తీవ్రంగా గాయమైనట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News