Sunday, January 5, 2025

యువతిపై నీళ్లు పోసి.. తండ్రి గొంతుకోసిన పోకిరీలు

- Advertisement -
- Advertisement -

కిరాణా షాపుకు వెళ్లిన యువతిపై నీళ్లు పోసి హేళన చేయడంతో పాటు ప్రశ్నించిన ఆమె తండ్రిని గొంతు కోసి, అడ్డువచ్చిన తల్లిపై దాడి చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నార్సింగి పరిధిలోని నెమలి నగర్‌కు చెందిన నాయికి రాముడు కూతురు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తన ఇంటికి సమీపంలోని కిరాణా షాపుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేశ్, అతడి గ్యాంగ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. హోలీ రోజు దొరకలేదని ఆమెపై నీళ్లు పోశారు. పోకిరీల అసభ్యప్రవర్తనతో భయపడిపోయిన సదరు యువతి వాళ్ల నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. దుకాణానికి వెళ్లిన యువతి ఏడుస్తూ రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడగ్గా జరిగిన విషయం చెప్పింది. యువతి తండ్రి రాముడు ఆ పోకిరీల దగ్గరకు వెళ్లి నిలదీశాడు. దీంతో వారు రాముడిని వారు భూతులు తిట్టారు.

ఈ విషయం కాలనీ పెద్దమనిషికి ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశోకా కిరాణా షాపు వద్దకు వస్తే మాట్లాడుదామని చెప్పాడు. అక్కడికి రాముడు అతడి కుమారులు సోమవారం ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వారు మాట్లాడుతుండగానే వెంకటేష్ అనే వ్యక్తి అడుగుతుండగా శ్రీధర్ అతడిపై చెంపపై కొట్టాడు, సురేష్ అతడి స్నేహితులు కలిసి బాధితుల కుటుంబంపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న సురేష్ యువతి వెంట్రుకలు పట్టుకుని కడుపులో కొట్టాడు. రాముడు భార్యపై నిందితులు దాడ ఇచేస్తుండగానే, సురేష్ సోదరుడు రాముడు పై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లాడు. తర్వాత కుటుంబ సభ్యులు అందరు కలిసి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత రాముడు వచ్చి తన ఇంటికి సమీపంలోని కిరాణా షాపు వద్ద కూర్చుండగా సురేష్ స్నేహితుడు ప్రవీణ్ కత్తితో రాముడు గొంతు కొసేందుకు యత్నించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సురేశ్, అతడి స్నేహితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వారిపై 307,354,354డి, 334 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి నాలుగు తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News