Sunday, December 22, 2024

అత్తాపూర్‌లో కత్తితో యువకుడి హంగామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కత్తితో ఓ యువకుడు హంగామా చేసిన సంఘటన అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. స్థానికంగా ఉంటున్న సర్దార్ జీ మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు సోమవారం అర్ధరాత్రి ఫుల్‌గా మద్యం తాగాడు. తల్వార్‌ను పట్టుకుని రోడ్డుపై వెళ్తున్న వారిపై తల్వార్‌తో దాడి చేయడంతో సయ్యద్ అక్బర్, మోను సింగ్‌తోపాటు అఖిల్(2)కు గాయాలయ్యాయి.

సర్దార్ తల్వార్‌తో ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తుండడంతో రోడ్డుపై వెళ్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News