Monday, December 23, 2024

తెలంగాణలో ‘ఈద్‌-ఉల్‌-ఫితర్’ ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -
‘ఈద్‌-ఉల్‌-ఫితర్’ ఎప్పుడు జరుపుకోవాలో ప్రకటించేందుకు రూయెత్‌-ఇ-హిలాల్ కమిటీ  ‘రంజాన్ 29న’ సమావేశం కానున్నది.

హైదరాబాద్: షవ్వాల్ మొదటి రోజున వచ్చే ‘ఈద్‌-ఉల్‌-ఫితర్’ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. తెలంగాణలో కూడా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ 2023 ప్రకారం, తెలంగాణలో ఈద్‌-ఉల్‌-ఫితర్ సెలవులు 22 , 23 తేదీలుగా పేర్కొన్నారు. వీటిని సాధారణ సెలవుల జాబితాలో చేర్చారు. ఏప్రిల్ 22న ఈద్‌-ఉల్‌-ఫితర్, ఏప్రిల్ 23న ‘రంజాన్ తరువాతి రోజు’గా ప్రకటించారు. ‘ఈద్‌-ఉల్‌-ఫితర్’ శనివారం జరుపుకుంటారు అన్న అంచనాతో తెలంగాణ క్యాలెండర్‌లో సెలవుగా ప్రకటించారు. అయితే పండుగ జరుపుకోవడం అన్నది చంద్రుని దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. దానిని రూయెత్‌-ఇ-హిలాల్ కమిటీ నిర్ధారిస్తుంది. హైదరాబాద్‌లో ఈద్‌-ఉల్‌-ఫితర్ ఎప్పుడు జరుపుకోవాలో ప్రకటించడానికి రంజాన్ 29న సెంట్రల్ రూయెత్‌-ఇ-హిలాల్ కమిటీ సమావేశం కానున్నది. నెలవంక దర్శనంపై వారు ఈద్‌-ఉల్‌-ఫితర్ ప్రకటిస్తారు.

సాధారణంగా మధ్యప్రాచ్యంలో చేసుకున్న తర్వాతి రోజున ఇండియాలో ఈద్ చేసుకోవడం పరిపాటి. కానీ ఈ ఏడాది, భారత్‌లో కూడా సౌదీ అరేబియా, మధ్య ప్రాచ్య దేశాలతో పాటు ఈద్ జరుపుకునే అవకాశం కనపడుతోంది.

బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన రిపోర్టు ప్రకారం మధ్య ప్రాచ్యంలో గురువారం టెలిస్కోప్ ఉపయోగించినా కూడా అర్ధ చంద్రుడు కనిపించడం అన్నది అసంభవం. ఇదే అంచనా నిజమైతే మధ్య ప్రాచ్య దేశాలు ‘ఈద్’ను శనివారం చేసుకుంటాయి. భారత్‌లో అర్ధ చంద్రాకారం శుక్రవారం కనిపిస్తే ‘ఈద్‌-ఉల్‌-ఫితర్’ను శనివారం చేసుకునే వీలుంది. ‘ఈద్‌-ఉల్‌-ఫితర్’ ఏ తేదీన జరుపుకోనున్నప్పటికీ… తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన క్యాలెండర్‌లో ఏప్రిల్ 22,23 తేదీలను సెలవుగా ప్రకటించింది. ఏప్రిల్ 23 ఆదివారం అవుతోంది. కనుక సాధరణ వీకెండ్ సెలవు కూడా కాగలదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News