Monday, January 20, 2025

నాగశౌర్య కాబోయే భార్య గురించి కొన్ని విషయాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నవంబర్ 20వ తేదీన బెంగళూరులో అనూష శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు, నెటిజన్లు, నాగ శౌర్య ఫ్యాన్స్ గూగుల్‌లో అనూష శెట్టి గురించి వెతుకుతున్నారు. కర్ణాటకలోని కుందాపూర్‌కు చెందిన అనూష శెట్టి ఒక వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్, అనూష శెట్టి డిజైన్స్ పేరుతో ఇంటీరియర్ డిజైన్ స్టూడియోని నడుపుతోంది. ఆమె విలాసవంతమైన విల్లాలు, అపార్టుమెంట్లు, ఆఫీసులకు ఇంటీరియర్ డిజైనర్ సేవలు అందిస్తూ ఉంటారట.

2019లో ఆమె డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. 2020లో ఆమె అత్యంత సృజనాత్మక ఇంటీరియర్ డిజైనర్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో ఆమె ఒకరిగా ఉన్నారు. నాగశౌర్య పెళ్లి వార్త విని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ముందస్తుగా నాగ శౌర్యకు వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక నాగశౌర్య ఇటీవల ‘కృష్ణ వ్రిందా విహారి’సిన్మాతో మంచి సక్సెస్‌ని అందుకుని కెరీర్ పరంగా ఫుల్ జోష్ మీదు ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News