Tuesday, April 1, 2025

పార్లమెంటులో ఎంపీలు ఉపయోగించకూడని మాటలు!

- Advertisement -
- Advertisement -

Parliament Monsoon session upcoming

‘అన్ పార్లమెంటరీ’ పదాల కొత్త జాబితాతో బుక్లెట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  లోక్‌సభ సచివాలయం-  లోక్‌సభ,రాజ్యసభ రెండింటిలోనూ అన్‌పార్లమెంటరీగా పరిగణించబడే పదాలు, వ్యక్తీకరణలను జాబితా చేస్తూ కొత్త బుక్‌లెట్‌ను రూపొందించింది. ఆ బుక్‌లెట్‌ జాబితా  ‘జుమ్లాజీవి’, ‘బాల్ బుద్ధి’, ‘కోవిడ్ వ్యాప్తి’, ‘స్నూప్‌గేట్’, ‘అరాచకవాది’, ‘శకుని’, ‘నియంతృత్వం’, ‘తానాషా’, ‘తానాషాహి’, ‘వినాష్ పురుష్’ ‘ఖలిస్తానీ’  వంటి పదాలను చర్చల సమయంలో లేదా ఉభయ సభల్లో  ఉపయోగించినట్లయితే పార్లమెంటు సభ్యులను సభ నుంచి గెంటేస్తారు.  కాగా ప్రతిపక్షం ఈ జాబితాను “గాగ్ ఆర్డర్” అని నిందించింది. వాస్తవాల నుంచి, విమర్శల నుంచి ప్రధాని నరేంద్ర మోడీని రక్షించడానికే ఉద్దేశించిందని పేర్కొంది. ఇదో రకంగా సెన్సార్ ఆర్డర్ అని టిఎంసి రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. ఈసారి పార్లమెంటు సమావేశంలో అగ్నివీర్ ఉద్యోగాలు, జమ్మూకశ్మీర్లో దాడులు ప్రాముఖ్యతను పొందనున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు కూడా చర్చకు రానున్నాయి. రిలీజియస్ ర్యాడికలిజమ్ విస్తరించడం గురించి కూడా చర్చించనున్నారు.

లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ”బిల్లులు లేదా సమావేశాల సమయంలో చేపట్టాలనుకుంటున్న సమస్యల గురించి ప్రభుత్వం ఇంకా తెలియజేయలేదు’’ అనని అన్నారు. “(ప్రధాని నరేంద్ర) మోడీ-జీ ఉన్నప్పుడు, సమస్యలను లేవనెత్తడానికి కొరతే  ఉండదు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News