Monday, December 23, 2024

డేటా ఎంట్రీపై అవగాహన

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఐకేపి ఏపియం రాజిరెడ్డి అద్యక్షతన మండల మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపియం రాజిరెడ్డి మహిళా సంఘాల సభ్యులతో సంఘాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులోను, స్త్రీనిధి, స్వయం సహాయక సంఘాల సమావేశాలు, ఫిష్ పాండ్,ఎంటర్ ప్రైజెస్, గ్రామ సంఘాల జనరల్‌బాడీ సమావేశాలుపై చర్చించి పలు సలహాలు సూచనలు చేశారు.

ఐబి అంశాలలో సంఘం సభ్యులు మరియు సంఘం యొక్క సమాచారం లోకోస్ డేటా ఎంట్రీ చేయడం పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిసిలు, అకౌంటెంట్ రమేష్, అన్ని గ్రామ సంఘాల అద్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News