- Advertisement -
సిసి టివిల ఏర్పాటుకు కెఎన్‌ఆర్ విరాళం
హైదరాబాద్ సిపికి అందజేసిన సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ సిసిటివిల ఏర్పాటు కోసం కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్చన్ ఎండి నర్సింహారెడ్డి విరాళం అందజేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను గురువారం కలిసి కోటి రూపాయల విరాళం చెక్కును అందజేశారు.
సిసి టివిల ఏర్పాటు కోసం విరాళం ఇచ్చిన సంస్థ ప్రతినిధులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అభినందించారు. ప్రజల భద్రత కోసమే సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -