Wednesday, January 22, 2025

ఎంబిబిఎస్ బిడిఎస్ ప్రవేశాలు

- Advertisement -
- Advertisement -

కాళోజీ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌తో యూనివర్సిటీ పరిధిలోని ప్రుభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జనవరి 5వ తేదీ (బుధవారం) ఉదయం 8 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటి అధికారులు పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని అధికారులు తెలిపారు.

KNRUHS Releases Notification for MBBS and BDS Courses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News