Monday, December 23, 2024

బిఎస్‌సి అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిఎస్‌సి అలైడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో గురువారం నుంచి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి

11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా, కళాశాలలవారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News