Monday, December 23, 2024

అనంతగిరిలో రోడ్డు ప్రమాదం… క్షతగాత్రులను కాన్వయ్ లో తీసుకెళ్లిన టిఆర్ఎస్ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

 

నల్గొండ: కోదాడ సమీపంలో అనంతగిరి శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి నుంచి కోదాడ వెళ్తున్న రహదారిలో అనురాగ్ కాలేజ్ సమీపంలో ఆటో బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో అనంతగిరిలో మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని కోదాడకు వెళ్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రమాదం జరిగిన స్థలానికి గుర్తించి వెంటనే తన కాన్వాయ్ ని ఆపారు. దిగి సహాయక చర్యలు చేపట్టారు.

తన సహాయక సిబ్బంది, అక్కడకు చేరిన మరికొందరి సహాయంతో గాయపడిన వ్యక్తిని వెంటనే తన కాన్వాయ్ లోని వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులకు ఫోన్ చేసి ఆ క్షతగాత్రుడికి తక్షణమే మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. ఆ క్షతగాత్రులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జిల్లాపెళ్లి గ్రామానికి చెందిన గుర్తించారు. కొంతమంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి హాస్పటల్ సూపర్డెంట్, వైద్యాధికారులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఔదార్యాన్ని అక్కడున్న వాళ్లంతా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News