Sunday, December 22, 2024

14 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో!

- Advertisement -
- Advertisement -

మల్కాపూర్(యాదాద్రి జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఓ వైపు కసరత్తు చేస్తుండగానే మరో వైపు ఆశావాహులు సిద్ధమవుతున్నారు.  నోటిఫికేషన్ ఇంకా విడుదల కాక ముందే కొందరు తమ ఎన్నిక మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నారు.  యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ చెందిన కొడారి లత మల్లేష్ కు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కొడారి లత మల్లేష్  గ్రామంలో దసరా, దీపావళి శుభకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తాను సర్పంచ్ గా గెలిపిస్తే ఏ పనులు చేస్తానో తెలియజేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 14  హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చు పారదర్శక పాలన అందిస్తానని కొడారి లత మల్లేష్ చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News