Tuesday, April 1, 2025

అపోలో ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో కొడాలి నాని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం రాత్రి కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త విన్న నాని అనుచరులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News