Friday, November 15, 2024

చంద్రబాబు 420, ఔరంగజేబు: కొడాలి నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భజన బృందంతో ఎన్‌టిఆర్ శతజయంతి వేడకలు నిర్వహించారని వైసిపి నేత కొడాలి నాని తెలిపారు. వైసిపి ప్రభుత్వంపై బాబు విమర్శలు చేయడంతో కొడాలి రీ కౌంటర్ ఇచ్చారు. ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మహానాడులో చంద్రబాబు భజన తప్ప ఎన్‌టిఆర్ గురించే మాట్లాడిందే లేదని, మహానాడులో నిర్వహించింది ఎన్‌టిఆర్ శతజయంతి వేడుకలా? అని ప్రశ్నించారు. ఎంఎల్‌ఎగా కూడా గెలవని లోకేస్ ఫోటోను మహానాడు వేదికపై పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు వెనుక బిసిలెవరూ లేరని, మహానాడు వేదికపై బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదని కొడాలి అడిగారు. చంద్రబాబు వెంట రామోజీ రావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పవన్ కల్యాణ్ ఉన్నారని విమర్శించారు. వీళ్లెవరు బిసిలు కాదని, అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడుతారని మండిపడ్డారు. ఎన్‌టిఆర్ శతజయంతి పేరుతో చంద్రబాబును పొగిడించుకున్నారని, మేనిఫెస్టో హామీలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు లేదన్నారు.

బిసిలకు చట్టం తీసుకవస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇస్తున్నారని, చంద్రబాబు పేదలకు కనీసం సెంట్లు స్థలం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని అడిగారు. అప్పుడు సీనియర్ ఎన్‌టిఆర్‌కు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్‌టిఆర్‌ను ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. జూనియర్ ఎన్‌టిఆర్ తల్లిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని, టిడిపి హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ కూడా ఉద్యోగం రాలేదన్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రుణాలు మాజీ చేశారా? అని కొడాలి అడిగారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను ఏమీ అనకుండానే ఆయన బోరున ఏడ్చారని, మరి జూనియర్ ఎన్‌టిఆర్ తల్లి మహిళ కాదా ఎందుకు దుష్ప్రచారం చేయిస్తున్నారని అడిగారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి పేదల కోసం చంద్రబాబు ఏం చేశారని కొడాలి ప్రశ్నించారు. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఓటేయించారని మండిపడ్డారు. చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని, దివంగత మాజీ ముఖ్యమ్రంతి వైఎస్‌ఆర్ అప్పుడే చెప్పారన్నారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్‌టిఆరే చెప్పారని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News