Thursday, April 10, 2025

లోకేష్ పాదయాత్రపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: నారా లోకేష్ పాదయాత్రపై కొడాలి నాని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ అర్హతతో లోకోష్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలావాలని సూచించారు. శాసనసభ్యుడిగా ఓడిపోయిన వాడు పాదయాత్ర చేయడమేంటి ? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉండి పాదయాత్ర చేయాలన్నారు. లోకేష్ పాదయాత్ర టిడిపికే ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. టిడిపిలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర అన్నారు. టిడిపి ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని కొడాలి నాని గుర్తుచేశారు. ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కొనేందుకే పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News