Monday, December 23, 2024

నిజం గెలిస్తే బాబు జైల్లోనే ఉంటారు భువనేశ్వరి: కొడాలి

- Advertisement -
- Advertisement -

అమరావతి: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం గెలిచింది కాబట్టే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. భువనేశ్వరి నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాదని, చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని విమర్శించారు. ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందో ప్రజలు తెలుసుకోవాలని కొడాలి చురకలంటించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం ఇవాళ్ల రెండు వేల కోట్లకు ఎదిగారని విమర్శలు గుప్పించారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు ఏ విధంగా రూ.35 కోట్లు కట్టారని అడిగారు. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బు రూ.7 కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని కొడాలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read:  డికాక్ భారీ శతకం.. బంగ్లాపై సౌతాఫ్రికా ఘన విజయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News