Wednesday, January 22, 2025

షర్మిలపై నాని సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం షర్మిల పాకులాడటం సరికాదని మంత్రి కొడాలని నాని దుయ్యబట్టారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. పది మంది పనికిమాలిన వెధవల్ని వెంటబెట్టుకొని దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డని అంటూ రావడం మంచిది కాదని హితువు పలికారు. తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని, ఇప్పుడు ఆంధ్రాలో అదే పని చేస్తున్నారని నాని దుయ్యబట్టారు. కనీసం కాంగ్రెస్‌కు ఈ సారి ప్రతిపక్షహోదా వచ్చే అవకాశం కూడా లేదని ఎద్దేవా చేశారు. జీరో పర్సెంట్ ఓట్ల శాతం ఉన్న షర్మిల, ఒక శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్‌తో కలిస్తే ఏంఏ జరుగుతుందని చురకలంటించారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్‌పై షర్మిల నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో గత పదేళ్ల నుంచి ఎపి సమస్యలపై కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. ఎపిలో ఏం జరుగుతుందో కనీసం అవగాహన లేని షర్మిల ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని నాని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News