Thursday, January 23, 2025

కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

గుడివాడ: ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు. ఇదివరలో నాలుగు సార్లు ఆయన గుడివాడ నుంచి గెలిచారు. కానీ ఈసారి(ఐదోసారి) మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఆయన ఓడిపోయారు.

కొడాలి నాని ఇంటిపై శుక్రవారం కొందరు యువకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆయన ఇంటిపై కోడిగుడ్లు విసిరారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా విఫలం అయింది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆ యువకులను తర్వాత అక్కడి నుంచి పంపేశారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News