Monday, December 23, 2024

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కోదండరామ్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తెలంగాణ జనసమితి( టిజెఎస్ ) వ్యవస్థాపక అద్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం భేటి అయ్యారు. అదివారం ఖమ్మంలో పొంగులేటి ఇంటికి వెళ్ళిన కోదండరాం ఆయనతో భేటి అయ్యి రాజకీయ అంశాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్ నుండి సస్పెండ్ అయిన పొంగులేటి ఏరాజకీయ పార్టీలో చేరుతారనేది స్పష్టం చేయకపోయినా అన్ని పార్టీలు ఆయనను తమ తమ పార్టీల్లో చేర్చుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

కర్ణాటకలో గెలుపుతో మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలు ఇప్పటికే పొంగులేటిని తమ పార్టీల్లో చేర్చుకోడానికి మంతనాలు చేస్తున్నాయి. కాగా పొంగులేటి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ పొంగులేఇని కలువడం ప్రాధాన్యత ససంతరించుకుంది. కోదండరామ్ పొంగులేటి ని తమ పార్టీలోకి ఆహ్వానించి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగే పొంగులేటిని కలిసిన వారిలో టిజెఎస్ ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, అంబటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్రావు తదితరులు ఉనా్ంనరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News