Sunday, January 19, 2025

టిజెఎస్ అధినేత కోదండరామ్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిఆర్ఎస్ ప్రభుత్వంపై టిజెఎస్ అధినేత ప్రొ.కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ప్రొ.కోదండరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శుక్రవారం కరీంనగర్ లోని వీ పార్క్ లో రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత స్పష్టత వస్తుందన్నారు. నియంత కెసిఆర్ ను ఓడించడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముధోలే, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ నియంతృత్వ పాలనను గద్దె దించేందుకే తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందని ప్రొ.కోదండరామ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News