Saturday, December 21, 2024

మేడిగడ్డ బ్యారేజి కుంగడం పై శ్వేత పత్రం విడుదల చేయాలి:కోదండరామ్

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్: మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగడం పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫసర్ కోదండరామ్ డిమాండ్ చేసారు. సోమవారం విద్యావంతులతో కలిసి ప్రాజెక్ట్ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ బ్యారేజి పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలంగాణ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యారేజీ నష్టం జరిగిన దానికి ఒక అంచనా వేయాలని, సాంకేతిక నిపుణులతో కూడిన జ్యుడీషియల్ ఎంక్వయిరీ కీ ఆదేశించాలని, బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి బాధ్యులు ఎవరో గుర్తించాలని, ముఖ్యమంత్రి పదేపదే కంపెనీల పై ఒత్తిడి తీసుకురావడం వారే జవాబుదారి అనడం సరికాదని,

ఇప్పటివరకు బ్యారేజీకి అవసరమైన ఖర్చు ఎంతో, నష్టం జరిగింది ఎంతో, కొత్తగా పునర్ నిర్మించడానికి అయ్యే ఖర్చు ఎంతో ప్రభుత్వం చెప్పాలని ఇప్పటివరకు సుమారు 30 నుండి 40 వేల కోట్లకు పైగా ఖర్చు వృధా అయ్యిందని, వృధా అయిన ఖర్చులకు జవాబుదారీగా ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం అందర్నీ నిందించి తమ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని, బ్యారేజీ నిర్మాణం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా చీఫ్ ఇంజనీరింగ్ అవతారం ఎత్తి స్థలం పరిశీలన చేసి మరీ బ్యారేజీ నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆయన తో పాటు విద్యా వంతు బృందం కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News