Saturday, November 23, 2024

శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఇఒ నాగరత్న, ఎఇఒ పార్థసారథి, సూపరింటెండెంట్‌  సోమ‌శేఖ‌ర్, ప్ర‌ధాన అర్చ‌కులు ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శుక్ర‌వారం ఉదయం 8 నుండి 8.25 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 7.45 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత  కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News