Friday, November 22, 2024

ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని శుక్రవారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. నిన్న ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డిప్యూటీ ఇఒ నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్‌ సోమ శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News