- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన భైరం నర్సింహులు పంట పెట్టుబడికి తీసుకున్న అప్పులు కట్టలేక పోయాడు. అప్పుల బాధతో గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా పెంబి మండలం యాపాలగూడ గ్రామంలో అర్క సంతోష్ (28) అనే యువ రైతు తన పొలంలో నకిలీ పత్తి విత్తనాలు పెట్టగా అవి మొలకెత్తలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
- Advertisement -