Tuesday, December 17, 2024

కొడంగల్ కేంద్రంగా గంజాయి రవాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొడంగల్: గంజాయి అక్రమ రవాణాకు కొడంగల్ కేంద్రంగ మారిందని.. ఒరిస్సా, ఆ ంధ్ర నుంచి కొడంగల్ మీదుగా నిందితులు ముంబయికి తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం స్థ్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పా టు చేసిన నేర సమీక్ష సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన టాస్క్ ఫో ర్స్ సిబ్బందితో పాటు ఎస్‌ఐ గోపాల్‌లను అభినందించారు. విశ్వసనీయ సమాచారంతో బుధవారం మం డల పరిధిలోని అప్పాయిపల్లి వద్ద సిబ్బంది వాహనాల తనిఖీలు చెపట్టారు. ఈ క్రమంలో ఏపి22ఎల్8159 నెంబరు గల ద్విచక్ర వాహనంపై ఉన్న నిందితుడు గోపాల్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.

పోలీసు లు నిందితుడిని వెంబడించి తనిఖి చేయగా 11 కే జీల గంజాయి లబించింది. పోలీసుల విచారణలో ని ందితుడిది జహిరాబాద్ కాగా 2 సంవత్సరాల నుంచి గం జాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకోచ్చి జహిరాబాద్‌లో విక్రయిస్తు న్నట్లు అంగికరించాడు. అలాగే నిందితుడిపై ఇది వరకే గంజాయి అక్రమ రవాణతో పాటు ఇతర కే సులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు బైక్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితుడు గోపాల్‌పై పీడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 2లక్షల 20 వేలు ఉంటుందని తెలిపారు.
రజాఖాన్ హత్య గంజాయి మత్తులోనే: కొడంగల్‌లో జరిగిన బాలుడు రజాఖాన్ కిడ్నాప్, మర్డర్‌లో నింధితుడు గంజాయికి బానిసని విచారణలో తెలినట్లు ఏస్పీ తెలిపారు. అప్పటి నుంచి ఈ ప్రా ంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తు ఉండాలన్నారు. అలాగే పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. గంజాయి సరఫరా చేసే వ్యక్తుల వివరాలను అందించాలని సూచించారు. గతంలో రేషన్ బియ్యం, కల్తి కారంపొడి, టీపొడి, నఖిలీ పత్తి విత్తనాల మాదిరే గంజాయిపై కూడా ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ రాములు, ఎస్‌ఐలు శంకర్, గోపాల్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News