Monday, December 23, 2024

రేవంత్ దమ్ముంటే నాపై పోటీ చేయ్..

- Advertisement -
- Advertisement -

కొడంగల్ ప్రజలు చీకొట్టినా కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి సోయి తప్పి ప్రవర్తిస్తున్నాడని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి  విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే తిరిగి తనపై పోటి చేయాలని రేవంత్‌కు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఇటివల సీఎం కేసీఆర్, కేటిఆర్, ప్రభుత్వంపై రేవంత్ చేసిన వాఖ్యలను ఎమ్మెల్యే తిప్పికొట్టారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 9 ఏండ్లు కొడంగల్‌కు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చేసిన పాపాలను అభివృద్ది రూపంలో కడుగుతున్నానన్నారు. కొడంగల్‌కు రైల్వేలైన్, సిమెంట్ ఫ్యాక్టరిలను కేంద్రం మంజూరు చేసినట్లు ఆధారాలతో నిరుపిస్తే.. రాష్ట్ర వాటా కోసం కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే సమాదానమిచ్చారు. రేవంత్ ఏంపిగా ఉండి కొడంగల్‌కు ఏమి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నాలుగేండ్లలో కొడంగల్ నియోజకవర్గ అభివృద్దికి రూ.536 కోట్లు ప్రభుత్వ ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కొత్తగా ఏర్పడిన కొడంగల్, కోస్గీ మున్సిపాలటిలకు రూ.56 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామాలు, తాండాల రోడ్ల నిర్మాణానికి రూ.85కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చివరి దశలో ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కొడంగల్ అభివృద్దికి తాను కట్టుబడి ఉన్నానని చర్చకు అంబేద్కర్ లేదా శివాజీ చౌరస్తాలో సిద్దమన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ అధ్యక్షులు శివకుమార్, ఎంపీపీ విజయ్‌కుమార్, జేడ్పిటీసీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌లు మధుసుధన్‌రావు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News