Monday, December 23, 2024

గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో కొడంగల్ ఉండేది: నరేందర్

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: అభివృద్ధికి ఆమడ దూరంలో కొడంగల్ ఉండేదని ఎంఎల్ఎ నరేందర్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన బహిరంగా సభలో ఎంఎల్ఎ నరేందర్ రెడ్డి మాట్లాడారు కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక రెండు మునిసిపాలిటిలకు 90 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని, మహ బూబ్ నగర్ నుంచి చించోలి  వరకు రోడ్డు కోసం సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారని గుర్తు చేశారు. కొస్గి మహబూబ్ నగర్ రోడ్డును కూడా బాగు చేసుకున్నామని వివరించారు. మాటలే కానీ చేతల్లో లేని వ్యక్తి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. అమెరికాలో రైతులకు 3 గంటల కరెంట్ చాలు అన్నాడని, మనకు అలాంటి వారు కావాలా? అని ఎంఎల్ఎ నరేందర్ రెడ్డి అడిగారు. కొస్గి రెవెన్యూ డివిజన్ గురించి సిఎం కెసిఆర్ కు వివరిస్తానని చెప్పారు. తండాలను గ్రామ పంచాయితీలుగా చేసుకున్నామని, నియోజక వర్గంలోని ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: బిజెపిని బతికించుకునేందుకు మోడీ విమర్శలు: గుత్తా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News