Thursday, January 23, 2025

వాటితో కొడంగల్‌ను ముక్కలు చేశారు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్న సిఎం కెసిఆర్ ఏం చేశారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్‌కు ఏం జరిగింది అడిగారు. గురువారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన పనులకు శిలాఫలకాలు తప్ప బిఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జిల్లాలు పెంచి కొడంగల్‌ను ముక్కలు చేశారని దుయ్యబట్టారు. కొడంగల్‌కు రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామన్న హామీ ఏమైందని రేవంత్ రెడ్డి నిలదీశారు. సిఎం కెసిఆర్ మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేస్తున్నారని, ఓటమి భయంతోనే కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటమి ఖాయం కావడంతో ఆపద మొక్కులు మొక్కుతున్నారని మండిపడ్డారు. ఓటమి భయం కెసిఆర్ గొంతులో స్పష్టంగా తెలుస్తుందని ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టూ పది వేల ఎకరాలు ఆక్రమించిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Also Read: వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే కెసిఆర్ లక్ష్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News