Monday, December 23, 2024

కథను నమ్మి సినిమా చేస్తా

- Advertisement -
- Advertisement -

Kodi divya deepthi movies

శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఇద్దరి మధ్యలో జరిగే సంఘటనలతో కొనసాగే కథతో ఆద్యంతం సస్పెన్స్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, భరత్ రొంగలి నటీ నటులుగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. శుక్రవారం చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి బర్త్ డే సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు..

ఆ స్ఫూర్తితోనే నిర్మాతగా..

మా నాన్నగారు తన శతాధిక చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసి సినీ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిన దిగ్దర్శకులు. ఆయన సృష్టించిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఆ స్ఫూర్తితోనే పెద్ద కుమార్తెగా ఆయన అడుగు జాడలలో నడుస్తూ వారి దివ్యాశీస్సులతో ముందుకు వెళ్లాలని నిర్మాతగా మారి కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో కిరణ్ అబ్బవరంతో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘ చిత్రం చేస్తున్నాను.

ఎంటర్‌టైన్ చేసే అన్ని అంశాలతో..

ఇద్దరి జీవితాల మధ్యలో జరిగే సంఘటనలతో జరిగే ఈ కథలో వారిద్దరూ ఎక్కడ రియలైజ్ అవుతారనే సస్పెన్స్‌తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు మెయిన్ టర్నింగ్ పాయింట్స్ బాగా సెట్ అయ్యాయి. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. హీరోయిన్‌కు తండ్రిగా ఎస్వీ కృష్ణా రెడ్డి నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ చేయడం చాలా సంతోషం. వైజాగ్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు జరిగే సాంగ్‌తో షూటింగ్ పూర్తవుతుంది.

కథను నమ్మి సినిమా…

దర్శకులు నాకు చెప్పే కథ విన్నప్పుడు ఏ జానర్ అయినా కానీ వారు చెప్పిన కథ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందనే ముఖ్యం. దాంట్లో ఉన్న ఆసక్తికరమైన అంశాలు ఏంటి?, ప్రేక్షకులు ఏ పాయింట్ కొరకు చివరి వరకు ఎదురు చూస్తారు? అనే పాయింట్ చూసుకొని, కథను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వస్తాను.

పాలకొల్లులో టీజర్ రిలీజ్…

ప్రధానంగా శ్రీధర్ ఎడిటర్. స్క్రీన్‌ప్లే పరంగా ఎక్కడ ప్రేక్షకులు స్పందిస్తారో అనే టైమ్‌సెన్స్ తనకు బాగా తెలుసు. అలాగే తను తీసిన ‘యస్.ఆర్ కల్యాణమండపం’ కూడా బిగ్ హిట్ అయింది. అదేవిధంగా ఈ కథలో కూడా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఇక మేము షూట్‌లో బిజీగా ఉండడం వలన 10వ తేదీన పాలకొల్లులో చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాము. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News