- Advertisement -
అమరావతి: కోడికత్తి కేసుకు సంబంధించి నియమించిన తాత్కాలిక న్యాయమూర్తి పూర్తి బాధ్యతలు స్వీకరించకపోవడంతో విచారణను మే 10వ తేదీకి వాయిదా వేశారు. నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ కోర్టు రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్ ద్వారా విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. వాయిదా వేసినప్పటికీ, ఆ రోజు కీలకమైన విచారణ జరుగుతుందని భావించారు. గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తిని కడప జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతో తాత్కాలిక న్యాయమూర్తిని నియమించారు. కోడికత్తి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
- Advertisement -