Thursday, January 23, 2025

ఆ కోడి పుంజు నాదే: వీడియో రిలీజ్ చేసిన యజమాని

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ బస్సులో మరిచిపోయిన కోడి పుంజు కథ అడ్డం తిరిగింది. ఆ కోడి పుంజు తనదే అంటూ ఓ వ్యక్తి వీడియో విడుదల చేయడంతో కోడి పుంజు వేలాన్ని ఆర్‌టిసి అధికారులు ఆపారు. నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి వరంగల్ నుంచి వేములవాడకు ఆర్‌టిస్ బస్సు ఎక్కాడు. తనతో పాటు ఓ సంచి కూడా చంకలో పెట్టుకున్నాడు. బస్సు దిగి వెళ్లేటప్పుడు సంచిన బస్సులో మరిచిపోయాడు. కరీంనగర్ వెళ్లిన తరువాత బస్సులో సంచి కనిపించడంతో కండక్టర్ ఓపెన్ చేశాడు. కోడి పుంజు కనిపించడంతో కరీంనగర్ బస్టాండ్ టిఎస్‌ఆర్‌టిసి అధికారులకు కండక్టర్ అప్పగించాడు.

నాలుగు రోజుల నుంచి ఓ కోడి పుంజును అధికారులు కంచెలో ఉంచారు. కోడి పుంజు ఆరు కిలోల వరకు ఉండడంతో వేలం వేయాలనియ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని ప్రకటించారు. అదే సమయంలో బాధితుడు తన కోడిపుంజు బస్సులో మరిచిపోయానని వీడియో విడదుల చేశాడు. తాను ఎపికి చెందిన వ్యక్తినని, జీవనోపాధి కోసం సిరిసిల్ల ఉంటున్నానని వివరణ ఇచ్చాడు. సంక్రాంతికి ఊరికి వెళ్దామని కోడిని పెంచుకుంటున్నానని చెప్పాడు. కోడి తనదేనని వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో టిఎస్‌ఆర్‌టిసి అధికారులు కోడిపుంజు అతడికి ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News