Monday, January 20, 2025

ఆ వీడియోలతో బెదిరించి ప్రియురాలిపై డ్యాన్స్ మాస్టర్, స్నేహితులు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రైవేట్ వీడియోలతో బెదిరించి మాజీ ప్రియురాలిపై ఓ స్కూల్ డ్యాన్స్ మాస్టర్, అతడి ఇద్దరు స్నేహితులు పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విద్యానారాయణ్‌పూర్ గ్రామంలో గోర్గ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయం కావడంతో ప్రేమలో పడ్డారు. దీంతో ఆమెతో సరదాగా ఉండడంతో పాటు ఇద్దరు శారీరకంగా పలుమార్లు కలుసుకున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు అతడు వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. జూన్ 2021 తరువాత అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని దూరంగా పెట్టింది. ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని తనతో సంబంధం పెట్టుకోకపోతే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

ప్రైవేట్ వీడియోలను గోర్గ్ తన స్నేహితులు సంతోష్, శశికు పంపించాడు. వాళ్లు ఆ వీడియోలతో బెదిరించి ఆమెను లొంగదీసుకోవడంతో పాటు గోర్డ్ ఆ వీడియోలను రికార్డు చేసుకున్నాడు. తన ప్రియురాలతో శృంగారం జరిపినందుకు స్నేహితుల వద్ద నుంచి రూ.3000, రూ.5000 తీసుకున్నాడు. ముగ్గురు నుంచి ఆమె ఇబ్బందులు ఉండడంతో వారి దూరంగా ఉంది. దీంతో గోర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసి వీడియోలను షేర్ చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. సోషల్ మీడియా, యూ ట్యూబ్ నుంచి ఆ వీడియోలను తొలగించారు. నిందితుల వద్ద నుంచి స్మార్ట్ ఫ్లోన్లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. గోర్గ్ పని చేసే స్కూల్‌కు వెళ్లి విద్యార్థినిల నుంచి సమాచారం తీసుకున్నారు. స్కూల్‌లో ఎవరితో అతడు అసభ్యంగా ప్రవర్తించిలేదని విచారణలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News