Sunday, December 22, 2024

తమన్నా స్పెషల్ సాంగ్ వీడియో వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ‘కొడితే’ అనే ప్రత్యేక గీతంలో నర్తించింది. తాజాగా ఈ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అల్లు బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇందులో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల కానుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘Kodithe’ Full Video Song out from Ghani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News