Wednesday, January 29, 2025

రోడ్డుకు పెళ్లి చేసి భోజనాలు పెట్టారు….

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: జంతువులు, కప్పలకు పెళ్లిలు చేసిన సంఘటనలు చూశాం… కానీ రోడ్డుకు పెళ్లి చేసిన సంఘటన కేరళలోని కోజికోడ్ ప్రాంతం కొడియాత్తూరు గ్రామంలో జరిగింది. రోడ్డుకు పెళ్లి చేయడమేంటని ఆలోచన ఎందుకు వచ్చిందా? అనే డౌటు మీకు ఉంది కదా?. 1980వ సంవత్సరంలో కొడియాత్తూరు గ్రామంలో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పుతో రోడ్డు వేశారు. అనంతరం గ్రామ జనభా పెరగడంతో గత 40 సంవత్సరాలలో రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డు వేయడానికి నిధులు లేకపోవడంతో గ్రామస్థులు నుంచి రూ.15 లక్షల చందాలు వసూలు చేశారు.

ఇంకా 45 లక్షల రూపాయలు అవసరం కావడంతో రోడ్డుకు కల్యాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేరళలో గతంలో పయట్టు, కురికల్యాణం కింద నిధులు సేకరించేవారు. ఇప్పుడు కూడా గ్రామస్థులు నిధుల కోసం పనం పయట్టు కింద రోడ్డుకు పెళ్లి చేసి భోజనాలు పెట్టారు. విరాళాలుగా వచ్చిన డబ్బులు రోడ్డు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని కుటుంబాలు భూమిని కూడా కోల్పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News