Sunday, January 19, 2025

అందరి చూపు కోహ్లీపైనే..

- Advertisement -
- Advertisement -

కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ సిరీస్ కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి కోహ్లికి నెలకొంది. కొంత కాలంగా టెస్టుల్లో కోహ్లి ఆశించిన విధంగా బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. బంగ్లా సిరీస్‌లోనూ పెద్ద స్కోర్లు చేయలేక పోయాడు. అయితే కివీస్ సిరీస్‌లో ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కోహ్లికి ఉంది. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే సిరీస్‌లో టీమిండియాకు ఎదురే ఉండదు.

మరోవైపు శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడిస్తారా లేదా అనేది సందేహమే. బంగ్లా సిరీస్‌లో ఆడిన జట్టునే ఈసారి కూడా బరిలోకి దించినా ఆశ్చర్యం లేదు. బౌలింగ్‌లో కూడా టీమిండియాకు తిరుగులేదు. బుమ్రా, జడేజా, అశ్విన్, సిరాజ్, ఆకాశ్ దీప్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా సిరీస్‌లో శుభారంభం చేయాలని తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News