Monday, April 28, 2025

ఐపిఎల్ లో కోహ్లీ సరికొత్త రికార్డు..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ చరిత్రలో కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్న రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అర్ధ శతకంతో రాణించాడు. దీంతో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్ ల్లో కోహ్లీ 443 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా 11 ఐపిఎల్ సీజన్లలో 400కు పైగా స్కోరు చేసిన ఒకే ఒక్క ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. ఓ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ(973) పేరిటే ఉంది.

కాగా, ఆర్సీబీ జట్టు కూడా ఈ సీజన్ తో వరుస విజయాలతో ఊహించని విధంగా చెలరేగుతోంది. ఇప్పటివరకు ఒక ఐపిఎల్ ట్రోఫీ కూడా గెలవని భాద ఆ జట్టును వెంటాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం కప్పు మనదే అన్నట్లు ఆర్సీబీ.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. ఆడిన 10 మ్యాచ్ లో ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో ఆర్సీబి.. ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రత్యర్థుల సొంత గడ్డపై వరుసగా 6 మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఒకే ఒక జట్టుగా ఆర్సీబి నిలిచింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించి 164 పరుగుల లక్షాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(51), కృనాల్ పాండ్య(73)లు అర్ధ శతకాలతో రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ.. భువనేశ్వర్ కుమార్(3/33) బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. భువికి తోడు హజిల్‌వుడ్ సయితం(2/36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నాస్‌టనికి 163 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్(41), స్టబ్స్(34)లు మాత్రమే రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News