Sunday, January 19, 2025

ర్యాంకింగ్స్‌లో కోహ్లి హవా

- Advertisement -
- Advertisement -

I always thinking like a Captain: Kohli

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సత్తా చాటాడు. ఆసియాకప్‌లో 275 పరుగులు చేసి మళ్లీ ఫామ్‌ను అందుకున్న కోహ్లి ర్యాంకింగ్స్‌లో హవా నడిపించాడు. ఈ క్రమంలో ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆసియాకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 810 రేటింగ్ పాయింట్లతో తొలి ర్యాంక్‌ను మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఈ టోర్నీలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్‌క్రామ్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ నాలుగో, డేవిమ్ మలన్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. భారత్ తరఫున టాప్10లో సూర్యకుమార్ ఒక్కడే నిలిచాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Kohli climbs 15 spot in ICC T20 Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News