Saturday, November 23, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. కోహ్లి ర్యాంక్‌ పదిలం

- Advertisement -
- Advertisement -

Dean Elgar climbs to top 10 in ICC Test Rankings

దుబాయి: సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఐసిసి టెస్టు టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించిన ఎల్గర్ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలను మెరుగు పరుచుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు. ఇంతకుముందు ఎల్గర్ 14వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తొమ్మిదో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో కోహ్లి పాల్గొనక పోయినా అతని ర్యాంక్‌కు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఇక టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టాప్5లో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ 924 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో లబుషేన్ అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జోరూట్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. కిందటిసారి అతను టాప్3లో చోటు సంపాదించాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఆరో, డేవిడ్ వార్నర్ ఏడో, బాబర్ ఆజమ్ 8వ ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు.ఇక న్యూజిలాండ్ యువ సంచలనం జేమిసన్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన జేమిసన్ ఏకంగా 8 ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. షాహిన్ అఫ్రిది, రబాడ, అండర్స్, సౌథి, హాజిల్‌వుడ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. నీల్ వాగ్నర్, హసన్ అలీలు కూడా టాప్10లో చోటు సంపాదించాడు.

Kohli continues at 9th spot in ICC Test Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News