- Advertisement -
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిలో అసాధారణ నాయకత్వ ప్రతిభ దాగివుందని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రశంసించారు. అతడు అసాధారణ నాయకుడంటూ కొనియాడారు. ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లలో మీకు నచ్చిన ఆటగాడు ఎవరంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కామెరూన్ ఈ విధంగా స్పందించారు.
కోహ్లి, రాహుల్ ద్రవిడ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. విరాట్ ఓ అద్భుత సారధి అని పేర్కొన్నారు. మైదానంలో అతను వ్యవహరించే తీరు తనను ఎంతో ఆకట్టుకుంటుందన్నారు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో కోహ్లి ఎప్పుడూ ముందు వరసలో ఉంటాడని తెలిపారు.
- Advertisement -