Saturday, November 16, 2024

అరుదైన రికార్డుపై కింగ్‌కోహ్లీ కన్ను

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల రారాజు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును సాధించేందుకు 64పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రపంచక్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కోహ్లీ 24,936పరుగులు చేశాడు. మరో రెండు రోజుల్లో నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టులో కోహ్లీ 64పరుగులు సాధిస్తే అత్యంత వేగంగా 25వేల పరుగులు పూర్తి చేసుకున్న రికార్డు నమోదు చేస్తాడు. అయితే ప్రస్తుత ఆటగాళ్లు ఎవరూ ఈ రికార్డుకు చేరువలో లేకపోవడం విశేషం. ఈ రికార్డును కోహ్లీ సాధిస్తే ఈ ఘనతను అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా విరాట్ నిలుస్తాడు.

కాగాక్రికెట్ గాడ్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఖాతాలో 34,357పరుగులు ఉన్నాయి. సచిన్ తరువాతరెండో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పరుగుల, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ 27,483పరుగులతో మూడోస్థానంలో ఉన్నాడు. తరువాత స్థానాల్లో శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ జయవర్ధనే 25,957పరుగులు, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కలిస్ 25,534పరుగులు, కోహ్లీ ఉన్నారు. ఈ జాబితాలో విరాట్‌కోహ్లీ కొనసాగతున్నాడు. టాప్5లో ఉన్న ఆరుగురు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News